Site icon HashtagU Telugu

Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి, మోడీకి అనుకూల వాతావరణం ఉంది: కిషన్ రెడ్డి

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో ఇతర పార్టీల సీనియర్ నాయకులు  ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. ఈసారి తమ ఓటు బీజేపీకి, మోడీకి వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయి.

కానీ వచ్చేది మోదీ ప్రభుత్వమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ అన్నివర్గాల ప్రజలను కోరుతున్నాను బీజేపీని బలపర్చాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా బీజేపీ వైభవంగా నిర్వహిస్తున్నదన్నారు.