Buddhism: నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీ

అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న

  • Written By:
  • Updated On - January 6, 2022 / 11:30 AM IST

అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ లో ఇప్పటికే 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ఏర్పాటై ఉంది. ఇందులోనే యూనివర్సిటీకి 40-60 ఎకరాలను ఇవ్వాలన్నది సర్కారు ప్రణాళిక.

బుద్ధుడిపై ఎన్నో పరిశోధనలు చేసిన ఆచార్య నాగార్జున ఈ ప్రాంతంలోనే నివసించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిది కాగా.. కోర్సుల పరంగానూ వినూత్నంగా ఉండనుంది. బౌద్ధ సంస్కృతి, శిల్పకళ, సాహిత్యం, వైద్యం, చిత్రకళలు, హాస్పిటాలిటీ, మార్షల్ ఆర్ట్స్, ఇంజనీరింగ్, పాలన, నిర్వహణ,టెక్నాలజీ తదితర విభాగాల్లో మొత్తం 68 సబ్జెక్టులను యూనవర్సిటీలో బోధించే ప్రణాళికతో ఉన్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.. యూనివర్సిటీ అభివృద్ధికి మలేషియా నుంచి ఒక బృందం ఆసక్తి చూపించినట్టు తెలిపారు.

ఇక్కడే బెంగళూరుకు చెందిన మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఒక ఆశ్రయం ఏర్పాటు కానున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తైవాన్ కు చెందిన ఫోగాంగ్ షాన్ ఆశ్రమం కూడా రానుందని చెప్పారు. దలైలామా ఆధ్వర్యంలో వెల్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటవుతుందన్నారు.