Telangana: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే?

తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను తెలంగాణ సర్కారు

  • Written By:
  • Updated On - December 1, 2022 / 04:58 PM IST

తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను తెలంగాణ సర్కారు వేగవంతం చేస్తోంది. కాగా ఇప్పటికే ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 9 మెడికల్ కాలేజీలు, అనుబంధ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌ లో మొత్తం 3,897 పోస్టుల భర్తీకి అనుమతిని ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని 9 కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్ కు పోస్టులు మంజూరు అయ్యాయి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలా మొత్తంగా 3,897 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. వివిధ భాగాల్లోని ప్రొఫెసర్,అసోసియేట్,అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటుగా ఇతర పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది.

అందరికీ అందుబాటులో సరైన వైద్యాన్ని అందించడం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు బిగ్ బూస్ట్ లభించిందని హరీష్‌ రావు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య తెలంగాణ మరొక ముందడుగు వేసిందని హరీష్ రావు ట్వీట్ చేసారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో అవుతోంది. అలాగే ట్వీట్ లో పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేశారు.