Site icon HashtagU Telugu

Kanti Velugu : కంటి వెలుగు ప‌థ‌కం.. తెలంగాణ‌లో 43 ల‌క్ష‌ల మందికి పైగా కంటి ప‌రీక్ష‌లు

Kanti velugu

Kanti velugu

తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన ‘కంటి వెలుగు’ పథకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మందికి పైగా పరీక్షలను పూర్తి చేసినట్లు ప్ర‌భుత్వం తెలిపింది, పథకం రెండవ దశ ఫిబ్రవరి 18 నాటికి సుమారు 8.42 లక్షల మంది ఉచిత ప్రిస్క్రిప్షన్ గ్లాసులను పొందారు. పథకంలో భాగంగా 1500 మంది నేత్ర వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందాలు 100 రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లద్దాలను ఉచితంగా అందజేసి సాధారణ కంటి జబ్బులకు మందులు అందజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అంధత్వాన్ని నివారించేందుకు ఉద్దేశించిన ‘కంటి వెలుగు’ పథకం 2వ దశను జనవరి 19న ప్రారంభించారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నారని అధికారులు వెల్ల‌డించారు.