CAG Report On Telangana : కేసీఆర్ స‌ర్కార్ అప్పుల‌పై ‘కాగ్’

తెలంగాణ ప్ర‌భుత్వం తీరును కాగ్ తప్పు బ‌ట్టింది. అప్పులు తీర్చ‌డానికి ప్ర‌భుత్వం రుణాలు చేస్తోంద‌ని తేల్చింది.

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 03:32 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం తీరును కాగ్ తప్పు బ‌ట్టింది. అప్పులు తీర్చ‌డానికి ప్ర‌భుత్వం రుణాలు చేస్తోంద‌ని తేల్చింది. ఫ‌లితంగా మౌలిక వ‌సతుల క‌ల్ప‌న రుణాల‌కు అనుగుణంగా జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంది. అయితే, ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అప్పులు చేసింద‌ని వివ‌రించింది. తెలంగాణ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను అసెంబ్లీకి సమర్పించింది. గ‌త ఐదేళ్ల‌లో తొలిసారిగా రెవెన్యూ మిగుల సాధించ‌లేక‌పోయింద‌ని కాగ్ చెప్పింది. దానికి కార‌ణం 97 శాతం లోటు మార్కెట్‌ రుణంలో ఉన్నందున రెవెన్యూ మిగులు సాధ్య‌ప‌డ‌లేద‌ని వివ‌రించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికను విడుదల చేసింది. బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితులను ప్రభుత్వం అధిగమించిందని నివేదిక పేర్కొంది. “2019-20లో తీసుకున్న చాలా రుణాలు గత అప్పులను చెల్లించడానికి ఉపయోగించబడ్డాయి. అంటే 75 శాతం అప్పులను రుణాలు చెల్లించడానికి ఉప‌యోగించార‌ని తేల్చింది. ఈ కార‌ణంగా ఆస్తుల సృష్టిపై ప్రభావం చూపింది. 2019 సంవత్సరంలో విద్య మరియు వైద్యానికి తక్కువ మొత్తం ఖర్చు చేయబడింది. ఆ మేర‌కు కాగ్ కేసీఆర్ స‌ర్కార్ కు అక్షింత‌లు వేసింది.