TS Jobs: తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పరిక్షల తేదిలను ప్రకటించిన అధికారులు మరో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్‌ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్ ఖాళీలు, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఆగస్టు 14గా నిర్ణయించారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించగా, మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులుతెలుపగా, తొలి దశలో 1,326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ నియామక బోర్డు, నిమ్స్ బోర్డు, ఆయుష్ ద్వారా త్వరలో మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

  Last Updated: 16 Jun 2022, 09:49 AM IST