Site icon HashtagU Telugu

Corona Affect: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం. సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు సెలవులు పొడిగించారు. కొంతకాలం పాటు విద్యాసంస్థల్లో నేరుగా తరగతులు నిర్వహించరాదని వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.