తెలంగాలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఆంక్షలు డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆంక్షలను జనవరి 10వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జనవరి 10 వరకు తెలంగాణలో ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిషేదిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ స్వీయ రక్షణ పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.