గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నేడు(శనివారం) తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుష్ప గుచ్చం పంపించారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని తమిళిసై ఆకాంక్షించారు. గులాబీ దళపతి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ పుష్పగుచ్చం తో పాటు ముఖ్యమంత్రికి పంపిన లేఖలో తెలిపారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు అని తెలిసి ఆందోళనకు గురైనట్లు గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు.
Concerned to hear the news of Hospital visit of Hon'ble CM Shri.KCR garu with minor symptoms.Pray for his good health & speedy recovery.@TelanganaCMO
(File Photo) pic.twitter.com/kC1CE70goc— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) March 11, 2022