Site icon HashtagU Telugu

Musi Encroachment : మూసీపై 10వేల నిర్మాణాల కూల్చివేత?

Musi Ktr

Musi Ktr

మూసీ న‌దికి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్ట‌నుంది. సుంద‌రంగా మ‌ల‌చ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం 16,600 కోట్లను ఖ‌ర్చు పెట్ట‌నుంది. కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ కు అనుసంధానం చేయ‌డం ద్వారా ఏడాది పొడ‌వునా నీటితో క‌ళ‌క‌ళ‌లాడేలా స‌ర్కార్ ప్లాన్ చేసింది. అందుకోసం న‌దిపై ఉన్న 10వేల అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. ఆ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించాడు.నదిని ఏడాది పొడవునా నీటితో నింపేందుకు గండిపేట మీదుగా కొండపోచమ్మ సాగర్‌కు అనుసంధానం చేయ‌డానికి 16,600 కోట్లు. దానిపై రోడ్లకు రూ.9,000 కోట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలకు రూ.3,866 కోట్లు కేటాయించారు. రూ.2,000 కోట్లతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నది పునరుజ్జీవనం కోసం నదిపై మూడు చెక్ డ్యాంలు , 14 వంతెనల నిర్మాణాన్ని కూడా ప్ర‌భుత్వం చేపడుతుందిఅసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం శాసనసభ్యుడు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా అడిగిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి కెటి రామారావు ఆ విషయాన్ని ప్రకటించారు.

మూసీ రివర్ ఫ్రంట్‌ దాదాపు 55 కిలోమీటర్ల మేర పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. న‌ది సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపాడు. మూసీకి ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీటిని తీసుకొచ్చి గండిపేట సరస్సుకు అనుసంధానం చేస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారన్న విష‌యాన్ని విశ‌దీకరించాడు. మూడు చెక్‌డ్యామ్‌లు, 14 వంతెనలు, రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నాడు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఇతర శాఖల ద్వారా పనులు చేపట్టాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. డిజైన్లను పోటీకి పిలిచి పనులు కూడా ప్రారంభించామని, మూసీని సుందర నదిగా తీర్చిదిద్దాలని ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పాడు. నదికి అడ్డంగా 10 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని మంత్రి తెలియజేశాడు. మూసీ నది కాలుష్యాన్ని అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేందుకు ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి)గా ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. గండిపేట నుండి ఔటర్ రింగ్ రోడ్డు (తూర్పు) వరకు (47 కి.మీ) మరియు హిమాయత్‌సాగర్ నుండి బాపూ ఘాట్ (8 కి.మీ) వరకు 55 కి.మీ పొడవునా మూసీ రివర్ ఫ్రంట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. నదుల ప్రక్షాళన, సుందరీకరణ, రవాణాతో సహా సమగ్ర అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని, మొత్తం రీచ్‌ను పునరుద్ధరించాలనే ఆలోచన ఉందన్నాడు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మూసీకి ఇరువైపులా రోడ్ల అభివృద్ధి, రోడ్లు సాధ్యం కాని చోట స్కైవేల కోసం సమగ్ర మాస్టర్ డెవలప్‌మెంట్ ప్లాన్ (సిఎమ్‌డిపి) మరియు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీకి కన్సల్టెన్సీని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపాడు. నగరంలో 54 మేజర్‌ నాలాలు ఉన్నాయని, డిసెంబర్‌ చివరి నాటికి మురుగునీటి శుద్ధి కోసం ప్రభుత్వం రూ.3,866 కోట్లు కేటాయించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మొత్తం మురుగునీటితో కంపుకొట్టే ముసీన‌ది త్వ‌ర‌లోనే ఆహ్లాద‌క‌రంగా అంద‌ర్నీ అల‌రించ‌నుందన్న‌మాట‌.