ఆర్టీసీ విలీన అంశం ఫై గవర్నర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా..ఆ అభ్యంతరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని , విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (TSRTC Merger Bill ) చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావించింది. కాకపోతే ఈ బిల్లు ఫై గవర్నర్ సంతకం పెట్టాల్సి ఉండడం తో శుక్రవారం ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపారు. రెండు రోజులు కావొస్తున్నా దీనిపై గవర్నర్ స్పందించకపోయేసరికి ప్రభుత్వం తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం ఏకంగా తమ విధులను పక్కకు పెట్టి బస్ డిపోల వద్ద దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేసారు. ఆ తర్వాత 8 గంటల ప్రాంతంలో బస్సులను బయటకు తీశారు.
రాజ్ భవన్ (Raj Bhavan) ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్లు హైదరాబాద్ కు చేరుకొని ఇందిరా పార్క్ నుండి ర్యాలీగా రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు.ఇదే క్రమంలో గవర్నర్ యూనియన్ సభ్యులతో చర్చలకు ఆహ్వానించి.. ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళి (Telangana Governor Tamilisai)సై వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు..? ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పింది.
Read Also : Telangana RTC Bill: గవర్నర్ ఊర్లో లేకపోయినా కేసీఆర్ హడావుడి..