Site icon HashtagU Telugu

Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు

Template (33) Copy

Template (33) Copy

తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని ఆలా కాకుండా హోం ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. మూడో వేవ్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని.. ప్రజలెవ్వరూ కూడా భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించాలని అయన కోరారు.