Site icon HashtagU Telugu

COVID Cases @ 500: తెలంగాణలో కొత్త కరోనా కేసులివే!

Covid Tests

Covid Tests

తెలంగాణలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గతవారంలో రెండు లేదా నాలుగు వందల సంఖ్యలో ఉన్న కేసులు ఒక్కసారిగా 500కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 563 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,03,937కి చేరుకుంది. జూలై 2న, 516 కేసులకు చేరుకున్నాయి. ఆదివారం 457 ఉండగా, సోమవారం 443 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరోసారి పెరిగింది. మిగతా రెండు రోజుల కంటే శని, మంగళవారాల్లోనే ఎక్కువ పరీక్షలు జరిగాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 297 కేసులు నమోదయ్యాయి, పొరుగున ఉన్న రంగారెడ్డి (64), మేడ్చల్ మల్కాజిగిరి (46) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రికవరీ కేసులు 434. రాష్ట్రంలో చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆ తర్వాత 500 కేసులు వెలుగుచూశాయి.