Gaddar Passes Away: బిగ్ బ్రేకింగ్.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో (Gaddar Passes Away) కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Gaddar Passes Away

Gaddar

Gaddar Passes Away: ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో (Gaddar Passes Away) కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. అందరికీ గద్దర్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.

1949లో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో గద్దర్ దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

Also Read: Love Story: వెలుగులోకి మరో ప్రేమ కథ.. భారత యువకుడిని పెళ్లి చేసుకున్న పాక్ యువతి?

తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు అందుకున్నారు. అయితే, నంది అవార్డును తిరస్కరించారు.

  Last Updated: 06 Aug 2023, 03:41 PM IST