Telangana Exit polls : కాంగ్రెస్ దే హవా అంటున్న ఎగ్జిట్ పోల్స్.. పూర్తి వివరాలివే?

Telangana Exit polls తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రం వద్ద భారీగా

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:12 PM IST

Telangana Exit polls తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రం వద్ద భారీగా జనాలు బారులు తీరారు. కాగా తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. 119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగానే నమోదయింది. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ నమోదు అయ్యింది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ ఏర్పడుతుందని తేలింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ దే హవా కనిపించింది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ – 56, బీఆర్ఎస- 48, బీజేపీ -10, ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. ఆరా సంస్థ కాంగ్రెస్ 58 నుంచి 67, బీఆర్ఎస్ 41 నుంచి 49, బీజేపీ ఐదు నుంచి ఏడు, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది.

ఇలా రెండింటిలోనూ కూడా కాంగ్రెస్దే పైచేయిగా నిలిచింది. ఇక సీప్యాక్ కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 41, బీజేపీ 4, ఇతరులు తొమ్మిది స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. పీటీఎస్ గ్రూపు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు 65 నుంచి 68 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. బీఆర్ఎస్ 35 నుంచి నలభై స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది.బీజేపీ ఆరు స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగానే తీర్పు చెప్పాయి. కాంగ్రెస్ కంఫర్ట్‌బుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఎక్కువ సంస్థలు తేల్చాయి. అలా మొత్తానికి కాంగ్రెస్ దే హవా అంటున్నాయి మెజారిటీ సర్వేలు. ఈ విషయంపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join