తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పక్రియ జరగనుంది. సమస్యత్మాక ప్రాంతాల్లో 4గంటలకు పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఖమ్మం టౌన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా యంత్రాంగం పోలింగ్‌కు ఎలాంటి ఆటంకాలు జరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల కోరారు.
Telangana Elections : ప్రారంభమైన తెలంగాణ పోలింగ్.. ఖమ్మంలో ఓటుహక్కు వినియోగించుకున్న తుమ్మల

Compressjpeg.online 1280x720 Image 11zon