Site icon HashtagU Telugu

Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి

Road Accidents

Road Accidents

Road Accidents: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్‌రావు, ఆయన డ్రైవర్‌ మృతి చెందారు. ఈ దుర్ఘటనలో కారు బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో న్యాయమూర్తి మోహన్‌రావు, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పాటు తిరుపతిలో నలుగురు మృతి చెందగా, ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు కొంగరవారిపల్లె వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న స్వామినాథన్ (35), రాకేష్ (12), రాధాప్రియ (14), గోపి (31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు మృతి చెందాడు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఉదయ ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించని కానిస్టేబుల్ పిల్లి సునీల్‌బాబు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కానిస్టేబుల్ మృతితో పోలీస్ స్టేషన్ సిబ్బంది దిగ్భ్రాంతి చెందారు. కాగా రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ చీఫ్ డి పురంధేశ్వరి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: Fake Doctors : నకిలీ డాక్టర్ల హల్‌చల్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం