TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

Published By: HashtagU Telugu Desk
Dgp Telangana Mahender Reddy Imresizer

Dgp Telangana Mahender Reddy Imresizer

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని డీజీపీ ప్రజలను కోరారు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు.. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని తెలిపారు.

కోవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ తెలిపారు. ఆరోగ్యశాఖ సూచనలను అమలు చేస్తామని, విమానాశ్రయంలో కూడా పరీక్షలు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని డీజీపీ తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను పోలీస్‌శాఖ కఠినంగా అమలు చేస్తుందని, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

 

  Last Updated: 31 Dec 2021, 02:35 PM IST