Telangana Farmers:తెలంగాణ రైతాంగానికి శుభవార్త…ధాన్యం తామే కొంటామన్న సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 08:44 PM IST

తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. కొనుగోళ్ల కోసం చీఫ్ సెక్రటరీ ఆద్వర్యంలో కమిటీ వేశామన్నారు. యాసంగిలో పండించిన ప్రతిగింజను రాష్ట్ర సర్కారే కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 3, 4 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఒక్క గింజను కూడా తక్కువ ధరకు అమ్మెుద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి.

పనికిమాలిన…దిక్కుమాలిన కేంద్ర సర్కార్ మోసం చేసినంత మాత్రానా..తామూ చూస్తూ ఉరుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిగ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రూ. 1960 మద్దతు ధరకు ధాన్యం కొంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మతపిచ్చితో దేశం భారీ మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మతోన్మాదుల కుట్రలో పడితే దేశం వందేళ్ల వెనక్కి వెళ్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రం చేతులెత్తేసిందని మండిపడ్దారు. దేశాన్ని చైతన్య పరిచే ఉద్యమంలో తాను ఖచ్చితంగా కీలకపాత్ర పోషించి తీరుతానని ముఖ్యమంత్రి తెలిపారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు బుద్ది ఉందా అంటూ మండిపడ్డారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల సిద్దాంతమన్నారు. రాష్ట్రాలను పెట్రోల్ పై పన్నులు తగ్గించాలంటున్న కేంద్రం…వాటిపై ఎందుకు పన్నులు తగ్గించదని తనదైన శైలిలో ప్రశ్నించారు. 30 నుంచి 35 శాతం నూకల వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఇంత రచ్చ చేస్తారా అని ఫైరయ్యారు. కేంద్రానికి తన బాధ్యత గుర్తుచేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక చిన్న రాష్ట్రం నుంచి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం వద్ద డబ్బులు లేవా అని ముఖ్యమంత్రి నిలదీశారు.