టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy)..ఏపీ ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నారు. ఏపీలో సీఎం జగన్ ఎలాగైతే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారో..తెలంగాణ లో కూడా టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదాం- తరిమికొడదాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నాయి.
ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని..తెలంగాణ సాధనకు ముఖ్య కారణాలు నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ గతంలో చెప్పి..ఆ హామీలను నెరవేర్చకపోగా.. ప్రజల హక్కులను కాలరాస్తున్నాడు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై సీఎం కేసీఆర్ దాడులకు పాల్పడుతున్నాడని రేవంత్ ఫైర్ అయ్యారు.
కేసీఆర్ ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్ లు పెడుతున్నామన్నారు. ఈ ప్రజాకోర్టు (Praja court)లో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు. సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేశామన్నారు. గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతాం..తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Also : Group 2 : గ్రూప్ 2 పరీక్షను నవంబర్ కు వాయిదా వేసిన తెలంగాణ సర్కార్