Site icon HashtagU Telugu

T Congress : దిగ్విజ‌య్ సింగ్‌తో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

Komatireddy

Komatireddy

దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను  వివ‌రించాన‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గత 20 నెలలుగా జరుగుతున్న పరిణామాలను దిగ్విజయ్ కు వివరించామన్నారు. బుధవారం రాత్రి దిగ్విజయ్ బస చేసిన హోటల్ కు వెళ్లి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో దిగ్విజయ్‌కి చెప్పినట్లు తెలిపారు. తాము అన్ని విషయాలు మాట్లాడుకున్నామని.. అవి బయటకు రాలేదన్నారు. పార్టీ అభివృద్ధికి తాను కొన్ని సూచనలు చేశానని చెప్పిన కోమటిరెడ్డి.. తాను చాలా ముందుగానే ఆయ‌న్ని కలిశానని, గురువారం గాంధీభవన్‌కు రాలేకపోయానని కోమటిరెడ్డి తెలిపారు.

Exit mobile version