Site icon HashtagU Telugu

Revanth Reddy: కరోనా ఎఫెక్ట్.. పాదయాత్రకు రేవంత్ దూరం

Revanth reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన వరుసగా పర్యటనలు చేస్తుండటం, కార్యకర్తలు, నాయకులను కలుస్తుండటంతో కరోనా బారిన పడ్డారు. శనివారం ఉదయమే కరోనా లక్షణాలు అని తేలడం రేవంత్ హోంక్వారంటైన్ అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సందేశం పంపారు. అయితే ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు.

ఈ పాదయాత్రలో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మధుయాష్కి పాల్గొననున్నారు. అయితే కరోనా కారణంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు దాదాపుగా దూరమైనట్టేనని తెలుస్తోంది. కాగా మరోవైపు కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.