టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను నాయకులు కింది స్థాయి లో తప్పకుండా చిత్తశుద్ధి తో చేపట్టాలని రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది.
కొద్ది రోజుల్లో తెలంగాణాలో ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు, జన జాగరణ పాదయాత్రలు జరగనున్నాయని, ఈ కార్యక్రామాలని అన్ని ప్రాంతాలలో తప్పకుండా జరపాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. నాయకులంతా పార్టీ లైన్ లో క్రమశిక్షణతో పని చేయాలని పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది.
రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతంగా చేస్తోందని, ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఉద్యమాలు, దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా, నిరుద్యోగ జంగ్ సైరన్, వరి దీక్షలు, కళ్ళాలలో కాంగ్రెస్ లాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టామని పార్టీ తీసుకున్న కార్యక్రమాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రివ్యూ చేశారు.