Site icon HashtagU Telugu

Podu Land Pattas: 30న కేసీఆర్ చేతుల మీదుగా గిరిజనులకు పోడు భూముల పట్టాలు

BRS Gates Open

Cm Kcr

Podu Land Pattas: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి వర్ణనాతీతం. సమాజానికి దూరంగా బ్రతుకుతూ కాయా కష్టం చేసుకుంటూ పూట గడుపుతారు. కాగా గిరిజనులకు భూమి కేటాయించడం ప్రభుత్వానికే సవాలుగా నిలుస్తుంది. ఏళ్ల నుంచి తెలంగాణాలో పోడు భూముల సమస్య ఉంది. అయితే గిరిజనులు కూడా సమాజంలో భాగమని భావించి, వారికి భూపట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఈ నెల 30న గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణి చేయాలనీ సీఎం కెసిఆర్ నిశ్చయించుకున్నారు.

పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం జూన్ 30వ తేదీ సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. నిజానికి ఈ నెల 34వ తేదీ నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 30 తేదికి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహిస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా ఉండటం ద్వారా పోడు భూముల పంపిణి కార్యక్రమాన్ని జూన్ 30 కి పొడిగించారు.

జూన్ 30న నూతనంగా నిర్మించిన ఆసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే గిరిజనులకు కెసిఆర్ పోడు భూముల పట్టాలను వారికీ అందజేయనున్నారు.

Read More: Road Accident : కర్నూలులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి

Exit mobile version