తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ గౌరవ సలహాదారు కోడూరు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సరాది విశ్వా వసు సంవత్సర తెలుగు తిధులతో కూడిన డైరీ(Ugadi Diary 2025)ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గారి చేతుల మీదుగా ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించబడింది. అర్చక ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సహకారాన్ని పెంచేలా ఈ డైరీ విడుదల చేయడం చాలా గొప్ప విషయమని సీఎం తెలిపారు.
IPL : ఐపీఎల్ ఫ్యాన్స్ కు TGSRTC గుడ్ న్యూస్
ఈ సందర్భంగా అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.ఆర్ శర్మ ముఖ్యమంత్రిని కలిసి అర్చక ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, ‘ఒకే శాఖ – ఒకే వేతన విధానం’ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సానుకూలంగా స్పందించడంతో అర్చక ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. తెలుగు తిధులతో కూడిన డైరీ తయారు చేయడం శుభపరిణామం అని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అర్చక ఉద్యోగుల అభివృద్ధికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ డైరీ ఆవిష్కరణతో పాటు అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.