తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు, కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి అలంకార పూజలో సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.