పెగాసిస్ ఇష్యూ పై పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ నిలతీస్తోంది. ఏడేళ్ళుగా టీఆర్ఎస్, బీజేపీ గేమ్ ఆడుతున్నాయనే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి ఎత్తి చూపాడు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి వచ్చిన వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసాడు.
అన్ని విషయాల్లో బీజేపీ కి పార్లమెంట్ వేదికగా సహకారం అందించిన టీఆర్ఎస్ పెగాసిస్ విషయంలో ఏమి చేస్తుందో చెప్పా లని అడిగాడు. నోట్ల రద్దు , జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు..ఇలా అన్ని రకాల బిల్లు కు టీఆర్ఎస్ బీజేపీ కి మద్దతు ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాటం చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ తో కలసి ఢిల్లీ వేదికగా రావాలని రవి పిలుపు ఇచ్చాడు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మిలియన్ మార్చ్ ఢిల్లీలో చేయాలని సూచించాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ ఇచ్చిన హామీ ఏమైంద ని నిలతీశాడు. ఇప్పటికైనా బీజేపీ, టీఆర్ఎస్ దాగుడుముతలు ఆపి పార్లమెంట్ వేదిక గా తేల్చుకోవాలి అని చురకలు వేసాడు. పెగాసిస్ మీద పోరాటానికి టీఆర్ఎస్ కలిసి రావాలని కాంగ్రెస్ కోరింది.