DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌’ లో తెలంగాణ టాప్!

ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - July 4, 2022 / 02:57 PM IST

ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా డీపీఐఐటీ (Telangana categorised as a top performer as per DPIIT ranking) ఎంతోమంది అప్ కమింగ్ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ లు వరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుండటంతో ఐటీ సంస్థలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఫలితంగా వర్ధమాన పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. తెలంగాణతో పాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా నిలిచాయి.

అయితే, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకింగ్ ప్రకారం గుజరాత్, మేఘాలయ కర్ణాటకలు అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ 2021ని సోమవారం కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. మొత్తం 24 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు (UTలు) ఈ జాబితాలో పాల్గొన్నాయి. వర్ధమాన వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కోసం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తీసుకున్న కార్యక్రమాలపై ర్యాంకింగ్‌లు ఆధారపడి ఉంటాయి.