ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 9న కీలక మంత్రిమండలి సమావేశం జరుగనున్నది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే కొత్త పీఆర్సీ అమలు చేయాలని వినతులు వస్తుండటంతో.. […]

Published By: HashtagU Telugu Desk
Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 9న కీలక మంత్రిమండలి సమావేశం జరుగనున్నది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే కొత్త పీఆర్సీ అమలు చేయాలని వినతులు వస్తుండటంతో.. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

  Last Updated: 06 Mar 2023, 09:59 AM IST