Site icon HashtagU Telugu

Telangana Cabinet : సమగ్ర కులగణన నివేదికకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

Power Point Presentation

Power Point Presentation

Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్‌ భేటీ కొనసాగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.

Read Also: BRS : బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ప్రకటించిన కేసీఆర్

క్యాబినెట్‌ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. పకడ్బందీగా సర్వేచేసి సమాచారం సేకరించాం అన్నారు.   కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్‌ మ్యాప్‌ తెలంగాణ నుంచి ఇస్తున్నాం. కులగణన విషయంలో ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తాం. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా! ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదు అని అన్నారు.

ఇకపోతే.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కులగణన నివేదికను అసెంబ్లీలో రిలీజ్​చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ ​కమిషన్ ​తీసుకోనున్నది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతో పాటు కులగణన వివరాలను తీసుకొని, ఫైనల్ ​సిఫార్సులు చేసే అవకాశం ఉంది. ఇందుకు కనీసం నాలుగైదు రోజులు సమయం తీసుకుంటారని కమిషన్ ​వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్​ ​కమిషన్​ కొత్త రిజర్వేషన్లను రికమండ్ ​చేయనుంది.

Read Also: TVS Jupiter CNG: TVS జూపిటర్ సీఎన్‌జీ ఈ నెలలో లాంచ్.. ధ‌ర ఇదేనా?