Telangana Budget : హైదరాబాద్ అభివృద్ధికి రూ.10,000 కోట్లు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అసెంబ్లీ స్పీకర్ కోరారు.

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 01:15 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అసెంబ్లీ స్పీకర్ కోరారు. అవకాశం కల్పించిన స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తెలంగాణ అప్పులు 7 లక్షల కోట్లకు చేరుకున్నాయని భట్టి విక్రమార్క అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం వల్లే నీటి కొరత ఏర్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గత పదేళ్లలో పరిపాలన సాగుతున్న తీరుపై డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను మళ్లీ మెరుగ్గా నడిపేందుకు ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఉద్యోగుల జీతాలను ప్రతినెలా ఒకటో తేదీన జమ చేసేందుకు మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో సంక్షేమానికి రూ.35,000 కోట్లు వెచ్చించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడు నెలల్లో వివిధ శాఖల్లో 31,700 మందికి పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాకుండా ప్రజల సమస్యలపై హామీలు ఇవ్వలేదని, హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణ బడ్జెట్ 2,91, 159 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,20,945 అని తెలిపారు. అయితే.. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు, వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

కేటాయింపుల విషయానికి వస్తే

  • సంక్షేమ పథకాలకు రూ. 40,000 కోట్లు.
  • నీటిపారుదల శాఖకు రూ. 26,000 కోట్లు.
  • వ్యవసాయ రంగానికి రూ. 72,659 కోట్లు.
  • జీహెచ్‌ఎంసీకి రూ. 3050 కోట్లు.
  • గృహజ్యోతికి రూ. 2,418 కోట్లు
  • హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10,000 కోట్లు.
  • పంచాయతీ రంగానికి రూ. 29,816 కోట్లు.
  • హెచ్‌ఎండీఏకు రూ. 500 కోట్లు.
  • మెట్రో పొడిగింపు కోసం రూ. 100 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు
  • రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కోసం రూ. 1525 కోట్లు.
  • ఆరోగ్య శాఖ రూ. 11,468 కోట్లు.
  • విద్యుత్ రంగానికి రూ. 16,410 కోట్లు.
  • రూ. 500 గ్యాస్ సింలిండర్ పథకం కోసం రూ. 723 కోట్లు కేటాయింపు.
  • రోడ్లు , భవనాలకు రూ. 5790 కోట్లు కేటాయించారు.
  • విద్యా రంగానికి రూ. 292 కోట్లు.

 

 

Read Also : KCR : ఎన్నికల తరువాత తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

Follow us