Site icon HashtagU Telugu

Telangana BJP: బండి 14 డేస్ వార్

sanjay bandi arrest

sanjay bandi arrest

తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బండి సంజయ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్ తో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ యుద్ధం వేగం పెరిగింది. తెలంగాణ అంతటా 14 రోజుల పాటు నిరసనలు తెలియచేయాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. మండలం, నియోజకవర్గ , జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది.
కరీంనగర్లో రాత్రి జాగరణ పేరుతో 317 జీవో కు వ్యతిరేకంగా బండి సంజయ్ దీక్ష కు దిగాడు. ఆ సందర్భంగా పోలీసు లు బండి సంజయ్ మీద కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులు రిమాండ్ ను కోర్ట్ విధించింది. దీంతో బండి జైలుకు వెళ్ళాడు. ఫలితంగా బీజేపీ శ్రేణులు రాష్ట్రవాప్తంగా నిరసనలు తెలిపారు.

ప్రస్తుతం బండి ఎంపీగా ఉన్నాడు. చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అనుమతులతో ఆయన్ను అరెస్ట్ చేయాలి. కానీ తెలంగాణ పోలీసులు చట్టాన్ని ధిక్కరించారని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశాడు. అలాగే ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాశారు. బీజేపీ కేంద్ర కమిటీకి, హోమ్ మంత్రి, ప్రధాన మంత్రికి జరిగిన సంఘటన పై ఫిర్యాదు చేశాడు. మొత్తం మీద ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు బండి అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. జైలు నుంచి బండి వచ్చే వరకు బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్దం పడింది. ఢిల్లీ నేతలు కూడా తెలంగాణకు వచ్చి ఈ సంఘటనపై పోరాటం చేయడానికి రానున్నారు. సో..మళ్ళీ టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మరో వార్ వరి ధాన్యం విషయంలో వచ్చినట్టే రానుందన్నమాట.