Site icon HashtagU Telugu

TBJP:కొత్త నినాదమెత్తుకున్న తెలంగాణ బీజేపీ

2019 ఎన్నికల్లో మిషన్ 70 అని బరిలోకి దిగిన బీజేపీ అట్టర్ ప్లాప్ అయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తమ లక్ష్యం మిషన్ 19 అని బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంది.

రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా అవతరించిందని కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావచ్చని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ దళిత వర్గాలను దారుణంగా మోసం చేశారని, దళిత సీఎం మొదలు దళిత బంధు వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని దింతో దళితులంతా ప్రత్యామ్నాయంగా బీజేపీవైపు చూస్తున్నారని ఆయా వర్గాల్లోకి బీజేపీ వెళ్లాలని కమలనాధులు స్కెచ్ వేశారు.

2023 సహా ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని , బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు చాలా కీలకమని బీజేపీ భావిస్తోంది. దానికోసం రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిషన్-19 పేరుతో ఆ నియోజకవర్గాల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా పేరుతో కార్యాచరణ రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

ఇటీవల బీజేపీ ఓ ఇంటర్నల్ సర్వే నిర్వహించగా ఎస్సీ నియోజకవర్గాల్లో 19కి 19 స్థానాల్లో బీజేపీ బలంగా ఉందని తేలిందట. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకే మిషన్-19 పేరుతో ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని బీజేపీ తెలిపింది. అందుకు అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించబోతున్నారట. ఇక ఈసారి బీజేపీ మిషన్ ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.