Site icon HashtagU Telugu

Andole MLA: క్షతగ్రాతులను ఆదుకున్న ఎమ్మెల్యే క్రాంతి

Andole

Andole

అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ తన గొప్ప మనసును చాటుకున్నారు. సకాలంలో రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించి, తక్షణం వైద్యం సాయం అందేలా చేశారు. తన నియోజకవర్గంలోని ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన జోగిపేట టౌన్‌ శివార్లలోని అన్నాసాగర్‌ బండ్‌ వద్ద రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నారు. ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని చూసి ఆగి క్షతగాత్రులను వెంటనే వాహనం ఏర్పాటు చేసి జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రాంతి కిరణ్ కూడా ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే చేసిన తీరుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.