Site icon HashtagU Telugu

Telangana Alert:నాలుగో వేవ్ ముప్పు.. తెలంగాణ అప్రమత్తం

Covid Fourth Wave Imresizer

Covid Fourth Wave Imresizer

దేశంలో కరోనా నాలుగో వేవ్ మొదలైందా ? అంటే.. గత 24 గంటల్లో దేశంలో చోటుచేసుకున్న కరోనా మరణాల సంఖ్యను చూస్తే ఔను అనే సమాధానమే లభిస్తుంది. ఆదివారం దేశంలో కేవలం 4 కరోనా మరణాలే సంభవించగా.. సోమవారం ఆ సంఖ్య ఏకంగా 214కు పెరిగింది . ఈవ్యవధిలో కరోనా కొత్త కేసులు కూడా 1,150 నుంచి 2,183కు చేరాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది.

కరోనా నాలుగో వేవ్ రాకుండా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో మహత్తర ఆయుధం మాస్క్. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మాస్క్ తప్పకుండా ధరించాలనే నిబంధనను పెద్దగా అమలు చేయలేదు. ఢిల్లీ లో కరోనా దడ నేపథ్యంలో.. తెలంగాణలో మళ్లీ మాస్క్ ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర వైద్య శాఖ యోచిస్తోంది. మాస్క్ ను ధరించని వారిపై జరిమానాలు వేసే ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని భావిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం నిబంధనను కూడా కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కోవిడ్ కేసుల్లో 40 శాతం ఢిల్లీలోనే బయటపడుతున్నాయి. అక్కడ కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా గత రెండు వారాల్లో 500 శాతం పెరిగింది. ఈనేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.