Site icon HashtagU Telugu

Covid-19: తెలంగాణలో కరోనా కొత్త కేసులు 3,801

Covid

Covid

తెలంగాణలో బుధవారం 3,801 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అందులో 1570 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోని ప్రాంతాల నుండి వచ్చాయి. తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 4, 078కి చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాల్లో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరిలో 254, రంగారెడ్డి జిల్లాలో 284, హనుమకొండలో 147, ఖమ్మంలో 139, సిద్దిపేటలో 96, సంగారెడ్డిలో 88 కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ నుంచి 86 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version