Site icon HashtagU Telugu

Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్‌స్పెక్టర్‌

Telangana

Telangana

Telangana: ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గాజులరామారం గ్రామంలో తనకున్న భూమిలో అభివృద్ధి పనులు చేసేందుకు కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన రత్నాకరం సాయిరాజు నుంచి ఇన్‌స్పెక్టర్ ఆకుల వెంకటేశం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అయితే రాజు నుంచి ఇప్పటికే రూ.2 లక్షలు లంచం తీసుకున్నాడు. కాగా ఇన్‌స్పెక్టర్‌ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని మొదటి అదనపు స్పెషల్ జడ్జి, ఎస్పీఈ, ఏసీబీ కేసుల కోర్టు ముందు హాజరుపరిచారు. లంచం మొత్తాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

Also Read: School Teacher : పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు..ఫుల్ గా మద్యం కొట్టి వచ్చాడు