Site icon HashtagU Telugu

Telangana: 25 జిల్లాల్లో జీరో కేసులు

Corona

Corona

రాష్ట్రంలో రెండురోజుల క్రితం 35 కోవిడ్-19 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,90,791కి చేరుకుంది. ఎలాంటి మరణాలు నమోదు కాకపోవడంతో మృతుల సంఖ్య 4,111కి చేరుకుంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,86,023కి చేరుకుంది. ప్రస్తుతం 657 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 99.39% ఉండగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గముఖం పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో పదుల సంఖ్యలో మాత్రం కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఏడు జిల్లాలు మినహా, మిగిలిన 25 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి.