Teenmar Mallanna : కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్

Teenmar Mallanna : ఇటీవల కుల గణన అంశంపై కాంగ్రెస్ పార్టీపై బహిరంగ విమర్శలు చేయడంతో పాటు కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుండడం తో మల్లన్న ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

Published By: HashtagU Telugu Desk
Mallanna Out

Mallanna Out

తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక నిర్ణయం తీసుకుతుంది. ఇటీవల కుల గణన అంశంపై కాంగ్రెస్ పార్టీపై బహిరంగ విమర్శలు చేయడంతో పాటు కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుండడం తో మల్లన్న ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Samantha : రష్మికకు స్పెషల్ గిఫ్ట్ పంపిన సమంత.. బిగ్ లవ్ అంటూ రష్మిక రెస్పాన్స్..

ఇటీవల కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ పై తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే నెల 12లోగా ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే.. తీన్మార్ మల్లన్న ఆ నోటీసులకు స్పందించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

TG High Court : తెలంగాణ‌లో బెనిఫిట్, ప్రీమియ‌ర్ షోల‌ పై హైకోర్టు కీల‌క తీర్పు

తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి అనేక వివాదాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ ఇటీవల రాష్ట్ర నేతలతో సమావేశమైనప్పుడు, మల్లన్నపై పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సస్పెండ్ తో మల్లన్న ఏ నిర్ణయం తీసుకుంటారు..? అధిష్టానం తో మాట్లాడి కాంగ్రెస్‌లో కొనసాగుతారో, లేక వేరే పార్టీలో చేరతారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

  Last Updated: 01 Mar 2025, 01:11 PM IST