Site icon HashtagU Telugu

3 Killed : న్యూ మెక్సికోలో కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురు మృతి

Gun

Gun

న్యూమెక్సికోలో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. ఓ యువ‌కుడు గ‌న్‌తో కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు . స్థానిక కాలమానం ప్రకారం సోమ‌వ‌రాం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్బుకెర్కీకి వాయువ్యంగా 180 మైళ్ల (290 కిలోమీటర్లు) దూరంలో న్యూ మెక్సికోలోని ఫార్మింగ్టన్ నివాస ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. ఫార్మింగ్టన్ పోలీసు ప్రతినిధి, షానిస్ గొంజాలెస్ మాట్లాడుతూ.. అనుమానితుడు కాలినడకన పావు మైలు దూరం వెళ్లాడని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న వారిపై కాల్పులు జరిపాడని తెలిపారు. కాల్పులకు గల కారణం ఇంకా తెలియ‌లేదు.