Cyber Fraud : సైబ‌ర్ మోసానికి గురై ప్రాణాలు తీసుకున్న టెక్కీ.. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘ‌ట‌న‌

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఉరివేసుకుని మృతి చెందాడు.

  • Written By:
  • Updated On - April 28, 2023 / 09:16 AM IST

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని బొమ్మారెడ్డి గూడెంకు చెందిన జాదవత్ అరవింద్ (30) టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి మొదట రూ.200 పెట్టుబడి పెట్టాడు. అర‌వింద్ ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసినంద‌కు.. దానికి బదులుగా రూ.250 వచ్చింది. దీంతో అర‌వింద్ త‌న సోద‌వి వివాహం కోసం దాచి పెట్టిన రూ.12 ల‌క్ష‌ల‌ను పెట్టుబడి పెట్టాడు, కానీ మే 5న జరగాలని నిర్ణయించిన తన సోదరి వివాహ స‌మ‌యానికి డ‌బ్బు రాలేదు. దీంతో తన టెలిగ్రామ్ యాప్‌లో దొరికిన చాట్ ప్రకారం.. అరవింద్ తన డబ్బును తిరిగి ఇవ్వమని మోసగాళ్లను వేడుకున్నప్పటికీ, వారు నిరాకరించారు. మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న టెక్కీ బుధవారం మధ్యాహ్నం సంగారెడ్డిలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందాడు.