Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ను కలిసి 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్

రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్.. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు.

మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

  Last Updated: 28 Mar 2025, 02:33 PM IST