IT News: టెక్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన ఆ కంపెనీలు.. మరోసారీ గడువు పెంపు??

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా మాంద్యం భాయాలతో పాటు ఇటీవల చాలా దేశాలు దివాలా తీయటం ఆర్థిక రంగాన్ని దివాలా తీసింద

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 08:00 PM IST

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా మాంద్యం భాయాలతో పాటు ఇటీవల చాలా దేశాలు దివాలా తీయటం ఆర్థిక రంగాన్ని దివాలా తీసింది. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల జోరు తగ్గింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు అందుకున్న 2022, 2023 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు అంతులేని ఆన్‌బోర్డింగ్ జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడాది కిందట నియామక పత్రాలు పొందినప్పటికీ నియమించుకున్న కంపెనీల నుంచి జాయిన్ అయ్యే తేదీ గురించి అప్‌డేట్ లేక ఆందోళనలో ఉన్నారు. కొన్ని కంపెనీలు ఈ గడువును పొడిగిస్తూ పోతున్నాయి.

దీంతో వారి ఆశలు ఎప్పటికప్పుడు నిరాశలు అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ FY24లో టెక్ నియామకాల్లో 30 శాతం క్షీణతను అంచనా వేయటం ఆందోళనలు కలిగిస్తోంది. బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు రిక్రూట్మెంట్ తగ్గించాలని ప్లానింగ్ లో ఉండటంతో ఫ్రెషర్‌లను నియమించుకోవడం తగ్గించాయి. పైగా ప్రస్తుత అవసరాల కోసం తమ ఉద్యోగులను అప్‌స్కిల్ చేస్తూ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. కాగా మరోవైపు ప్రాజెక్టులు లేక చాలా మంది బెంచ్ పైనే కొనసాగుతూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

దాదాపు 25,000 మంది విద్యార్థులు తమ ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీలు ఆఫర్లను ఆలస్యం చేయటం లేదా రద్దు చేయటం సరైనది కాదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ అన్నారు. రెండు మూడు క్వార్టర్లు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కంపెనీలు ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసి వారికి వెంటనే శిక్షణ ఇవ్వాలని పరిశ్రమ అనుభవజ్ఞులు అంటున్నారు. కొద్ది రోజుల్లో వృద్ధి ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఇప్పుడే ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసి వారి నమ్మకాన్ని, గౌరవాన్ని పొందడం తెలివైన నిర్ణయంగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ అన్నారు.