Operation Kaveri: సుడాన్ అంతర్యుద్ధం కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. అక్కడి సైన్యం మరియు పారామిలటరీ మధ్య సంధి కుదరకపోవడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుడాన్ లో ఇరుక్కున్న విదేశీయులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల ప్రతినిధులు తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో సుమారు 4000 మంది భారతీయులు చిక్కుకుపోయారు, వారిలో 1100 మంది సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. 3 బ్యాట్లలో దాదాపు 670 మంది పౌరులు భారతదేశానికి చేరుకున్నారు. కాగా.. భారత్ కు చేరుకున్న బాధితులు సుడాన్ లో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. హర్యానాకు చెందిన సుఖ్‌విందర్ మాట్లాడుతూ..మేము మరణ శయ్యపై ఉన్నట్లు అనిపించింది. ఎప్పుడెప్పుడు మా ప్రాణాలు పోతాయా అంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతికాము అని గోడు వెళ్లబోసుకున్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరి కింద మొదటి బ్యాచ్‌లో భారతదేశానికి చేరుకున్నాడు సుఖ్‌విందర్. సుఖ్వీందర్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఆయన హర్యానాలోని ఫరీదాబాద్ నివాసి.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఛోటూ సూడాన్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఛోటూ సుడాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. కానీ నేను ఇండియాలో అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు అన్నాడు. నేను చనిపోయాక భారత్ కు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇంకెప్పుడూ సూడాన్‌కు వెళ్లనని చెప్పాడు. నేను నా దేశంలో ఉంటూ ఏదైనా పని చేసుకుంటానని అన్నాడు.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నివాసి తస్మర్ సింగ్ (60)ను సూడాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చారు. సూడాన్‌లో జరుగుతున్న ఘర్షణల సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని భయానకమైనదని ఆయన వివరించారు. కరెంటు, నీళ్లు లేని చిన్న ఇంట్లో సచ్చిన శవంలా బ్రతికామని గుర్తు చేసుకున్నాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు, కానీ జీవించి ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వారిలో 19 మంది కేరళ నివాసులు.
సుడాన్ (Sudan)నుంచి ఢిల్లీ (Delhi) విమానాశ్రయానికి చేరుకున్న బాధితులకు వెల్కమ్ చెప్పారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వారి ఫోటోలను షేర్ చేశారు.సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ని ప్రారంభించింది. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్, నేవీల సాయం తీసుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారత వైమానిక దళానికి చెందిన రెండు C-130J విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా నౌకాదళ నౌక ఐఏఎన్ఎస్ సుమేధ కూడా పోర్ట్ సూడాన్ చేరుకుంది. మొదట భారతీయులను ఈ నౌక ద్వారా జెడ్డాకు తీసుకువస్తున్నారు మరియు ఇక్కడి నుండి ప్రజలు C-130J ద్వారా న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
Read More: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కారణమిదేనా..?