Site icon HashtagU Telugu

ODI: ఆస్ట్రేలియాతో వన్డేకు టీఇండియా జట్టు ప్రకటన… కెప్టెన్‌ ఎవరంటే?

Whatsapp Image 2023 02 19 At 21.13.29

Whatsapp Image 2023 02 19 At 21.13.29

ODI: కంగారులతో జరిగే మూడు, నాలుగు టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించేసింది. జట్టు ఫాంలో ఉండడంతో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌నే కొనసాగించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌ వంటి ప్లేయర్లకు చోటు దక్కుతుందని అందరూ భావించగా మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కూ జట్టుకు ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా వన్డే టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వగా.. జయదేవ్ ఉనద్కత్‌కు కూడా బీసీసీఐ చోటు కల్పించింది. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం అవ్వగా.. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది.

మొదటి వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్సీని చేపట్టడని బీసీసీఐ వెల్లడించింది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. కుటుంబ కారణాల వల్ల తొలి వన్డేకు దూరమయ్యాడని.. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. టెస్టుల్లో అదరగొట్టిన అశ్విన్‌కు వన్డే జట్టులో చోటు కల్పించలేదు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌లకు జట్టులో అవకాశం కల్పించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలో జరగనుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, చివరిదైన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది. అంతకుముందు మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు మ్యాచ్, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.

చివరి రెండు టెస్టులకు టీమిండియా టీం.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎస్.గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆర్.జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.