Site icon HashtagU Telugu

India vs WI: వన్డే సిరీస్ భారత్ దే

Team India

Team India

సొంత గడ్డ పై టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ గెలిచిన భారత్ సీరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రోహిత్ శర్మ 5, రిషబ్ పంత్ 18, విరాట్ కోహ్లీ 18, కేఎల్ రాహుల్ 49, సూర్యకుమార్ యాదవ్ 64, వాషింగ్టన్ సుందర్ 24, దీపక్ హుడా 29, శార్దుల్ ఠాకూర్ 8 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ నమోదు చేయడంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.

238 పరుగుల టార్గెట్ చేదించే క్రమంలో విండీస్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా…పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ధ కృష్ణ తనదయిన పేస్ తో చెలరేగిపోయాడు. కీలక ఆటగాళ్లను త్వరగా ఔట్ చేసి మలుపు తిప్పాడు.
మధ్యలో బ్రూక్స్ , హాసన్ పోరాడినా కీలక సమయంలో వారిని ఔట్ చేసిన భారత బౌలర్లు మ్యాచ్ పై పూర్తిగా పట్టు బిగించారు. చివరికి విండీస్ 193 పరుగులకు అలౌట్ అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది. విండీస్ ను దెబ్బ తీసిన ప్రసిద్ధ కృష్ణ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ నమోదు చేశాడు. 9 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీనిలో 3 మెయిడెన్ ఉండడం విశేషం. సీరీస్ లో మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది.

Cover Pic Courtesy- BCCI/Twitter