Site icon HashtagU Telugu

Hyderabad: సెమీస్‌లో టీమ్ ఆల్ఫా, మైసా, మావెరిక్స్, స్వాన్స్

Gulf

Gulf

హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌ సెమీఫైనల్ స్టేజ్‌కు చేరింది. హోరాహోరీగా సాగుతున్న మూడో సీజన్‌లో టీమ్ ఆల్ఫా, టీమ్ మైసాతో పాటు మీనాక్షి మావెరిక్స్, స్వాన్స్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఊహించినట్టుగానే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. గ్రూప్ ఎలో టీమ్ ఆల్ఫా సామా ఏంజెల్స్‌పై విజయం సాధించింది. గ్రూప్ బిలో మీనాక్షి మావెరిక్స్ 7-1 స్కోర్‌తో ఎంవైకే స్ట్రైకర్స్‌ పైనా, గ్రూప్ సీలో డిఫెండింగ్ ఛాంపియన్ స్వాన్స్ జట్టు 5-3 స్కోర్‌తో స్వింగ్ కింగ్స్‌పైనా గెలుపొందాయి.

ఇక గ్రూప్ డిలో టీమ్ మైసా 4.5-3.5 స్కోర్ తేడాతో లాహిరి లయన్స్‌పై విజయం సాధించింది. టీమ్ మైసా జట్టు 1 పాయింట్ తేడాతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. సెమీస్ లో మావెరిక్స్ తో టీమ్ మైసా , టీమ్ ఆల్ఫాతో స్వాన్స్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 12న వూటీ గోల్ఫ్ కౌంటీలో సెమీఫైనల్స్ జరగనుండగా.. ఈ సీజన్ ఫైనల్ పోటీలు థాయ్‌లాండ్‌లోని రాయల్ జెమ్స్ ఎరెనా గోల్ఫ్ కోర్స్ ఆతిథ్యమివ్వనుంది.