Site icon HashtagU Telugu

AP Employess: కదం తొక్కిన ఉద్యోగ సంఘాలు

Ap Employess

Ap Employess

ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. పలు ప్రభుత్వ కార్యాలయా వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు నిర్వహించాయి.‌ నగరంలోని ఎన్జీవో హోమ్స్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో ఉద్యోగ సంఘనేతలు నిరసన తెలియజేశారు.‌ ఈ నిరసన కార్యక్రమంకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుండి ఉద్యోగులు హాజరై తమ నిరసనను తెలియజేశారు.