Site icon HashtagU Telugu

Teacher: ఉపాధ్యాయులను సార్, మేడమ్ అని పిలువకూడదు..స్కూల్స్ లో సరికొత్త రూల్

Whatsapp Image 2023 01 13 At 21.27.13

Whatsapp Image 2023 01 13 At 21.27.13

Teacher:  తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. మరి గురువును ఇప్పుడంతా కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సార్ అంటూ, మేడమ్ అంటూ ఇప్పుడున్న పిల్లలు పిలవడం అలవాటు. అయితే ఇలా పిలువడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఓ వ్యక్తి పిటీషన్ వేశాడు. దీంతో కేరళలోని బాలల హక్కుల కమిషన్ సరికొత్త సర్క్యూలర్ ను జారీ చేసింది.

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ”టీచర్‌” అని సంబోధించాలని కేరళ బాలల హక్కుల కమిషన్‌ వెల్లడించింది. ఉపాధ్యాయులు పురుషులు లేదా మహిళలు ఎవరైనా కూడా ‘సర్‌’ అనో లేకుంటే ‘మేడమ్‌ ‘ అనో సంబోధించడం కాకుండా ‘టీచర్‌’ అనే పిలవాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కెఎస్‌సిపిసిఆర్‌ జారీ చేసిన ఈ ఆదేశాలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి.

సర్‌, మేడమ్‌ అనే లింగ బేధం లేకుండా టీచర్‌ అని పిలవడమే సరైన పదమని కెఎస్‌సిపిసిఆర్‌ చైర్‌పర్సన్‌ కె.వి.మనోజ్‌ కుమార్‌, సభ్యుడు సి.విజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విద్యాశాఖకు ఇటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులను ఈ విధంగా పిలవడం వల్ల అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుందని వారు తెలియజేశారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుంబంధాన్ని కూడా ఆ పదం పెంచుతుందని, అందుకే ఇది పాటించడం ఎంతో ముఖ్యమని కమిషన్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల మధ్య లింగ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు బాలల హక్కుల కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా దీనిని అందరూ పాటించాల్సిందేనని తెలిపింది.

Exit mobile version