Site icon HashtagU Telugu

Viral video: తరగతి గదిలో నిద్రపోతున్న టీచర్…గాలి విసురుతున్న విద్యార్థిని..!!

1185942987 Government School Teacher Sleeping In Class Video Goes Viral

1185942987 Government School Teacher Sleeping In Class Video Goes Viral

ఉపాధ్యాయురాలు నిద్రిస్తుంటే…విద్యార్థిని గాలి విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న కొందరు టీచర్లకు…బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనే నిదర్శనం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యార్థులతో చాకిరి చేయించుకుంటున్నారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగాహి పురైనా గ్రామంలోని కతర్వా ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ దృశ్యం జరిగింది. విసనకర్రతో ఓ విద్యార్థిని  ఊపుతుంటే…ఉపాధ్యాయురాలు నిద్రిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు…టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Video link: https://www.instagram.com/tv/CebH7BdJMPo/?utm_source=ig_web_copy_link